*విశ్వజ్ఞాన మహోన్నత కీర్తిశిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

విశ్వజ్ఞాన మహోన్నత కీర్తిశిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే నివాస ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి, అనంతగిరిపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు రైల్వే స్టేషన్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు


వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని, ఆ మహనీయునికి నివాళిగా తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చాటి చెప్పుతూ… దేశంలోనే… ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి హైదరాబాద్ నడిఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ జరగనుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు రాష్ట్ర సచివాలయానికి నామకరణం చేసి, వారి విగ్రహ ఆవిష్కరణ మరియు వారి ఆశయ సాధనలో సంపూర్ణ సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page