ఛట్ పూజా సందర్భంగా చెరుకు పంపిణీ

Spread the love
Distribution of Sugarcane on the occasion of Chat Puja

ఛట్ పూజా సందర్భంగా చెరుకు పంపిణీ చేసిన గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్చెరు ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థానిక ఉత్తర భారతీయులకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి చెరుకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న సంస్కృతులకు నిలయంగా, మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.

ఛట్ పూజ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చెరుకును పంపిణీ చేయడంతో పాటు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page