పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ .

Spread the love

Distribution of sarees to poor women during Christmas under the direction of Palla Kiran Kumar.

పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ .

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

ఖమ్మం నగరంలో స్వర్గీయ కీర్తిశేషులు పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థంగా పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రిస్టియన్ మహిళలకు సుమారుగా 100 మంది కి చీరలను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా పల్లా కిరణ్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు .

వారి తండ్రి యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ పదిమందికి ఉపయోగపడుతూ ప్రజల్లో మమేకమై ఉన్నారన్నారు . జీవితాంతం ఆయన ఆశయ సాధన కోసమే కృషి చేస్తానన్నారు. వారి నాన్న పేరు మీద ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు .

ప్రతి ఏట లాగే ఈ ఏట కూడా పేద క్రిస్టియన్ లకు తమ వంతుగా సహయం చేశారని తెలిపారు . ఈ కార్యక్రమంలో షాలోమ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు ప్రకాశం పాస్టర్ పాల్గొని ప్రార్థన చేసి ప్రారంభించారు

Related Posts

You cannot copy content of this page