పాదయాత్రతో నెట్టెంపాడు సాధించడంతో నా ఒక్క కులానికి నీళ్లు రాలేదు:డికె అరుణ

Spread the love

గ్రామాల్లో నా ఒక్క కులానికే రోడ్డు వేయలేదు..

కులాలను చూసి పనిచేయలేదు అందరు నా వాళ్ళు అనే భావనతో పని చేశాను


ధరూర్:-మండలం డ్యాగ దొడ్డి, ఉప్పెర్ గ్రామలలో గురువారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ బలపరిచిన గద్వాల నియోజకవర్గం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలిగేర బోయ శివారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ మాట్లాడుతూ…బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీ ఊరికి వచ్చిన బిజెపి పార్టీ అభ్యర్థి బోయ వాల్మీకి శివా రెడ్డిని కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి ఆశీర్వదించాలని గ్రామస్థులను అభ్యర్థించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు సాధించడంతో నేడు పంట పొలాలు పచ్చగా మారి రైతులు సంతోషంగా ఉన్నారు.పాదయాత్ర చేసి నెట్టెంపాడు సాధించడంతో నా ఒక్క కులానికి నీళ్లు రాలేదని గ్రామాల్లో నా ఒక్క కులానికి రోడ్లు వేయలేదని అందరు నావాల్లే అనే భావనతో పని చేశానని డికె.అరుణమ్మ అన్నారు.

పదేళ్లలో తట్టెడు మట్టి తీయాలేని అసమర్ధ ప్రభుత్వం ఎన్నికల రాగానే గట్టు ఎత్తిపోతల పథకం గుర్తుకొస్తుంది.గద్వాల ప్రాంతంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఈ పదేళ్లలో ఒక అభివృద్ధి చేసింది లేదు.కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. రైతులకు ఎరువుల మీద సబ్సిడి ఇచ్చి యూరియా ను తక్కువ ధరకే ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వంగ్రామాల్లో వీధి రోడ్లు,వీధి దీపాల కోసం కేంద్ర ప్రభుత్వము అనేక నిధులు మంజూరు చేస్తుంది.నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆడబిడ్డల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం, బేటి బచావో బేటి పడావో లాంటి గొప్ప పథకాలను తీసుకుని వచ్చింది.పల్లేలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిర్జాపురం రామచంద్ర రెడ్డి,పార్లమెంట్ కో కన్వీనర్ సంజీవ్ భరద్వాజ్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు దరూరు కుర్వకిష్టాన్న , మండల అధ్యక్షుడు రాజేష్ అయ్యా,సర్పంచ్ మాసమ్మ,వాల్మీకి నాయకులు వైండింగ్ రాములు, రాముడు,మండల నాయకులు హన్మంత రాయ,సుధాకర్ రెడ్డి,dy లక్ష్మన్న ,ఉప్పెర్ అంజి రెడ్డి, అదిమల్లరెడ్డి, సరలమ్మ ,రఘు గౌడ్ ,పాండు,తదితరులు ఉన్నారు..

Whatsapp Image 2023 11 16 At 1.51.22 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page