చార్మినార్ పోలీస్ బందోబస్ట్ ను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్

Spread the love

CP CV Anand supervised the Charminar police bandobust

చార్మినార్ పోలీస్ బందోబస్ట్ ను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్.

చార్మినార్: శుక్రవారం జరిగే సామూహిక గణేష్​ నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గం పాతబస్తీ చార్మినార్ ​ప్రాంతాన్ని నగర పోలీస్​కమిషనర్ ​సీవీ ఆనంద్​పరిశీలించారు.


ఈ సందర్భంగా నగర పోలీస్​కమిషనర్​ సీవీ ఆనంద్ మాట్లాడుతూ….. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర ఊరేగింపు మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మల్టిపుల్ క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు,డాగ్ స్క్వాడ్‌లు, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్‌లు,షీ టీమ్‌లు కూడా రంగంలోకి దిగనున్నాయన్నారు. మండప నిర్వాహకులు, సామాన్య ప్రజలు కూడా పోలీసులకు,ఇతర వాలంటీర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నగర పోలీస్​ కమిషనర్​ వెంట అడిషనల్​ సీపీ డీఎస్​ చౌహాన్, జాయింట్​ సీపీ రంగనాథ్, సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్​తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page