భక్త అభయాంజనేయ స్వామి ఆలయ మండల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in Mandal Pooja of Bhakta Abhayanjaneya Swamy Temple…

భక్త అభయాంజనేయ స్వామి ఆలయ మండల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని శ్రీ సాయి కాలనీలో గల భక్త అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన మండల పూజలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. భక్త అభయాంజనేయ స్వామి వారి కృప ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కర్నేకంటి పండరి మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page