పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

Spread the love

Construction of five 33/11 KV sub-stations in Patancheru constituency

పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు


సాక్షిత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సూచనల మేరకు టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ (TSSPDCL) సిఎండి కార్యాలయం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారని పేర్కొన్నారు. సుమారు 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అమీన్పూర్ చక్రపురి కాలనీ, పటాన్చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాల్, సింఫనీ పార్క్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ గోశాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page