గవర్నర్​కు పంచాయతీ రాజ్ చాంబర్​ నేతల ఫిర్యాదు

Spread the love

Complaint of Panchayat Raj Chamber leaders to Governor

గవర్నర్​కు పంచాయతీ రాజ్ చాంబర్​ నేతల ఫిర్యాదు

నిధులు మళ్లిస్తే పంచాయతీ రాజ్ వ్యవస్థ మనుగడ కష్టం

కేంద్రానికి పంపిస్తానని గవర్నర్ తమిళిసై హామీ

ప్రధాన కార్యదర్శి బాదెపల్లి సిద్దార్థ వెల్లడి

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదెపల్లి సిద్దార్థ ఆరోపించారు.

గత నెల(డిసెంబరు) 24న రాష్ట్రంలోని జిల్లా పరిషత్​లు, మండల పరిషత్​లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.3,500 కోట్లు బదిలీ చేసిందన్నారు. ఆ తర్వాతి రోజు క్రిస్మస్ హాలిడే ఉన్నప్పటికీ.. అదే రోజున నిధులను రాష్ట్ర ఖజానాకు దారి మళ్లించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి,

చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి పంచాయతీ రాజ్ చాంబర్​ నేతలు సత్యనారాయణ రెడ్డి, బాదేపల్లి సిద్ధార్థ, శ్రీశైలం, వెంకట్ , అశోక్ రావు వినతిపత్రం అందచేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించే కార్యక్రమం గతంలో కూడా జరిగిందని, మున్ముందు ఇలాగే జరిగితే పంచాయతీ రాజ్ వ్యవస్థ మనుగడ కష్టమని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page