భవన వ్యర్ధాలు రోడ్లపై వేస్తే చర్యలు తప్పవు – కమిషనర్ హరిత ఐఏఎస్

Spread the love

సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపైన భవన నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో కమీషనర్ హరిత మాట్లాడుతూ రోడ్లపై ఎక్కడంటే అక్కడ భవన నిర్మాణ వ్యర్ధాలను తెచ్చి వేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. అదేవిధంగా ఆ వ్యర్ధాలను తీసుకొచ్చిన వాహనాలకు కూడా భారీ జరిమానాలను విధించాలన్నారు.

ఫుట్ పాత్ ఆక్రమణలను ఉపేక్షించరాదని, ఫుట్ పాత్ ఆక్రమించిన వారిపై కూడా జరిమానాలతో చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఎవరైనా ఎక్కడైనా రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నా, సెట్ బ్యాక్ వదలకుండా భవనాలు నిర్మించినా అలాంటి వారిని ఉపేక్షించినటువంటి అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు కచ్చితంగా తీసుకోబడునని కమిషనర్ హరిత హెచ్చరిక జారీ చేశారు. బిపిఎస్ స్కీములో ఈ నెలాఖరు వరకు పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు అన్నిటిని క్లియర్ చేయాలన్నారు. అదేవిధంగా ఎల్.ఆర్.ఎస్ అప్లికేషన్స్ కూడా క్లియర్ చేయాలన్నారు. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు బకాయిలు ఉన్నటువంటి ఏజిన్సీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తిస్థాయిలో తెలపాలని, మొండి బకాయిలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి సచివాలయంలో 12 రిజిష్టర్లు మెయింటైన్ చేయాలని, తాము తనిఖీలకు వచ్చినప్పుడు వాటిని పరిశీలించడం జరుగుతుందనే విషయాన్ని సచివాలయ సిబ్బంది గుర్తుంచుకోవాలన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లలో టిడిఆర్ బాండ్లు పంపిణీ సక్రమంగా, వేగవంతంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లు సాయిలీల, శారదాంబ, సూపర్డెంట్ హాసీమ్, అన్ని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page