మచిలీపట్నం ఆక్రమణలకు చెక్..!
మచిలీపట్నంకు పూర్వ వైభవమే ధ్యేయంగా కొల్లు రవీంద్ర అడుగులు
ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం
ఆక్రమణదారుల పాలిట సింహ స్వప్నంలా మారిన మంత్రి కొల్లు రవీంద్ర
అధికారంలోకి రాగానే ఆక్రమణలపై దృష్టి పెట్టిన కొల్లు
మొన్న మూడు స్థంభాల సెంటర్ లో ఆక్రమ కట్టడాలు కూల్చివేత
నిన్న జడ్పీ సెంటర్ లో ఆక్రమణలు తొలగింపు
నేడు దేవాదాయ శాఖ ఆధీనంలోకి కబ్జాకు గురైన తమ్మన వారి సత్రం
కొల్లు రవీంద్ర తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు
మచిలీపట్నం :
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఆక్రమణలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కబ్జాకు గురి కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్రమణలపై దృష్టి పెట్టింది.
వైసీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మచిలీపట్నం వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉదాహరణకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ లో మడుగు పోరంబోకు భూమిలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయ స్వార్థం కోసం వేసిన అక్రమ గృహ నిర్మాణాలను కూల్చివేయడం,
జిల్లా పరిషత్ సెంటర్ లో మున్సిపాల్టీకి చెందిన చెరువు చుట్టూ వైసీపీ సానుభూతిపరుల సహకారంతో వేసిన వాణిజ్య దుకాణాలను తొలగించడం,
తాజాగా వైసీపీ నేతల కబ్జాకు గురైన తమ్మన వారి సత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో కోట్లు విలువ చేసే తమ్మన వారి సత్రం ఆక్రమణకు గురైంది.
వందేళ్ల క్రితం తమ్మన పిచ్చయ్య అనే వైశ్య ప్రమఖులు అపకర్మల నిమిత్తం బలరామునిపేటలో 616 చ.గల స్థలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు విరాళంగా అందజేశారు.
సదరు స్థలంలో దాతల సహకారంతో సత్రం నిర్మించారు.
సత్రం అద్దెల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించారు.
ఆ తర్వాత సత్రం నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై కన్నేసిన ఆక్రమణదారులు గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించారు.
దీనిపై అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర పోరాటం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్ర మచిలీపట్నంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలపై దృష్టి పెట్టారు.
అందులో భాగంగానే మూడు స్థంభాల సెంటర్ లో పోడు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడం, జడ్పీ సెంటర్ లో మున్సిపల్ చెరువు చుట్టూ ఆక్రమంగా వేసిన వాణిజ్య దుకాణాలను తొలగించారు.
తాజాగా తమ్మన వారి సత్రాన్ని కూడా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆక్రమణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
భవిష్యత్తులో కూడా మరిన్ని ఆక్రమణలపై మంత్రి రవీంద్ర దృష్టి పెట్టి మచిలీపట్నంను ఆక్రమణదారుల చెర నుండి విడిపించేలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం…
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app