ఘనంగా శ్రీశ్రీశ్రీ వీరంజనేయ శివాలయం 16వ వార్షికోత్సవం.

Spread the love

Celebrating the 16th Anniversary of Sri Sri Sri Veeranjaneya Shiva Temple.

ఘనంగా శ్రీశ్రీశ్రీ వీరంజనేయ శివాలయం 16వ వార్షికోత్సవం.


సాక్షిత : కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో గల శ్రీ వీరాంజనేయ శివాలయం దేవాలయం16వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ముఖ్యఅతిథిగా ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి డివిజన్ లోని పాపిరెడ్డినగర్ లోగల శ్రీశ్రీశ్రీ వీరంజనేయ శివాలయం16వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు పరంకుశం వెంకట చారి, గంగాధర్ పూజారీలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు పలుపంచుకొని మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్నదానం , సాయంత్రం స్వామివార్ల ఊరేగింపు కొనసాగింది . బస్తీలో మేళతాలలు, భజన కీర్తనల మధ్య స్వామి వారి ఊరేగింపు భక్తులను భక్తపారవశ్యంలోకి తీసుకెళ్లింది.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు ధర్మారావు, ప్రధాన కార్యదర్శి దొడ్ల రాంరెడ్డి, కోశాధికారి కిరణ్, బస్తి అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి , ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి ,

కోశాధికారి నర్సింహులు ముదిరాజ్, కాంటెస్టడ్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిటీ సభ్యులు , నాయకులు ఆనంతరములు, హన్మంత్ రెడ్డి, కనకా రెడ్డి, శరత్ రెడ్డి, నర్సిరెడ్డి, పాండు గౌడ్ , సత్యనారాయణ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page