కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ

Spread the love

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి కవిత

మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ

సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. కవిత – బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు ఇచ్చిన వాంగ్మూలాలను చూపించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

ఈ నెల 15వ తేదీ వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది. ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆమెను కలవొచ్చు. మరోవైపు ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్ ను కోర్టు అనుమతించింది. ఆప్ కు రూ. 100 కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్లు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా ఉండదని బెదిరించారని చెప్పింది.

Related Posts

You cannot copy content of this page