మంచి భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ ను గెలిపించాలి…

Spread the love

మంచి భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ ను గెలిపించాలి…
బిఆర్ఎస్ పాలనలో కాలనీలతో పాటు ప్రతి బస్తి అభివృద్ధి సాధించింది…: ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద


సాక్షిత : 128 – డివిజన్ వివేకానంద నగర్ లో ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ మన వెల్ఫేర్ అసోసియేషన్ వివేకానంద నగర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద మాట్లాడుతూ గతంలో ఈ కాలనీలో ప్రగతి యాత్ర చేపట్టినప్పుడు మహిళా సోదరీమణులు రోడ్డు వేయాలని కోరారని, రోడ్డు వేసినంకనే ఇక్కడి వస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వేసి మల్లి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరిని కలిశానన్నారు. కాబట్టి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించి సీఎం కెసిఆర్ ని హ్యాట్రిక్ సీఎంగా రాష్ట్రానికి అందించాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద సమక్షంలో కాలనీకి చెందిన పలువురు యువకులు, మహిళలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : ప్రవీణ్, శ్రీకాంత్, విజయ్, సిద్ధార్థ్, అమిత్, దీపక్ గోస్వామి, మహేష్, మల్లేష్, నరేందర్, నితిన్, పింటూ, సాయి, సంతోష, శ్రావణ్ గోసామి, వికాస్, శ్రావణ్, సంతోష్, సుజిత్, విన్ను, నిరంజన్.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కర్ణ కంటి మల్లేష్, మక్సుద్ అలీ, అశోక్, ప్రభాకర్ గుప్త, బాస్వరజ్, రవిశంకర్, సురేష్, గోపాల్, వరదరాజు, సాయి, శ్రీకాంత్, నిజాం సంజయ్, పీ.వెంకటేష్ గౌడ్, శేఖర్ రావు, , మహిళా నాయకురాలు విజయలక్ష్మి, స్వప్న, , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

మన వెల్ఫేర్ అసోసియేషన్ వివేకానంద నగర్ : ప్రెసిడెంట్ మదక చందు, జనరల్ సెక్రెటరీ పాల యాదగిరి, కే సంతోష్ కుమార్, చలమారెడ్డి, ఎండి చాంద్ పాశా, కే కృష్ణ, గోపాల్, రాజు, నర్సింగ్ రావు, ఎండి అలీ, సత్యనారాయణ, యేసప్ప మరియు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 03 At 1.46.11 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page