తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్

Spread the love

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్
తిరుపతిలో సృజనాత్మక పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సుధీర్ఘ చర్చ
సాక్షిత : ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్ కలిశారు. ఎంపీ గురుమూర్తి అభ్యర్థన మేరకు వారు ఎంపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్బంగా సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక పరిజ్ఞానం వాటి ఆధారిత ఆర్థిక కార్యకలాపాల గూర్చి విస్తృత చర్చ జరిగింది.

తిరుపతి జిల్లాలో సృజనాత్మక పరిశ్రమలు ఏర్పాటు అలాగే ఇప్పటి వరకు మేధో సంపత్తిని సృష్టించడం, సంపద మరియు ఉద్యోగ కల్పనకు సంబంధించి ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది.

ముఖ్యంగా సృజనాత్మక పరిశ్రమలు క్రియేటివ్ ఇండస్ట్రీస్, అడ్వర్టైజింగ్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫెస్టివల్స్, క్రాఫ్ట్స్, డిజైన్ అండ్ ఫ్యాషన్, లిటరేచర్ అండ్ పబ్లిషింగ్, మ్యూజియమ్స్, హెరిటేజ్ మరియు పబ్లిక్ స్మారక చిహ్నాలు వంటి రంగాలు మరియు. గేమింగ్ ఫిల్మ్ అండ్ వీడియో, ప్రదర్శన కళలయినటువంటి మ్యూజిక్, డాన్స్, థియేటర్, పబ్లిక్ స్ట్రీట్ ఆర్ట్, టెలివిజన్ మరియు రేడియో, గ్యాలరీలు మరియు పార్కులు మరియు పెయింటింగ్, ఫోటోగ్రఫీ మరియు శిల్పకళలు వంటి దృశ్య కళలు కూడా ఉన్నాయని ఇవన్నీ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

సృజనాత్మక పరిశ్రమలు ఏ ప్రాంతానికైనా దేశానికైనా జాతీయ సంపద సృష్టి మరియు అంతర్జాతీయ ఖ్యాతికి ఒక ముఖ్య సహకారం అందిస్తుందని బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ అన్నారు.

కోవిడ్ 19 అనంతర పరిస్థితులలో ఈ సృజనాత్మక రంగంపై ఈ ప్రభావం బాగా ఉందని తమ అధ్యయనం ద్వారా తెలిందని ఆయన అన్నారు.

వీరు ఈ రంగంపై చేస్తున్న విస్తృతమైన అధ్యయనం గమనించిన ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లాలో
కూడా ఇలాంటి అధ్యయనం నిర్వహిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని వారిని కోరడంతో అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలియజేసారు.

ఈ అధ్యయన నివేదిక మన ప్రాంతంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ యొక్క పరిమాణం మరియు స్థాయిని తెలియబరుస్తుందని, దేశీయ ఉత్పత్తి, సంపద సృష్టికి మరియు సంస్కృతి పరిశ్రమల సహకారం ఇలా మూడు దశల అధ్యయనం అనంతరం ఇంకా ఎలాంటి రంగాల ద్వారా సంపద సృష్టి, ఉద్యోగ కల్పన లాంటి అవకాశలను మెరుగు పరచుకోవచ్చు అనే విషయాలకు సంబందించి స్పష్టమైన అవగాహన వస్తుందని తద్వారా ఏయే రంగాలను బలోపేతం చేయవచ్చో తెలుస్తుందని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page