ప్రశాంత్ నగర్ లో భవాని బైక్ పాయింట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో భవాని బైక్ పాయింట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ . అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు అందచేశారు..

ఈ   సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని  ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, చలివేంద్రాలు ప్రజల దాహాన్ని తీర్చడానికి ఎంతో దోహద పడుతాయని మరియు బాటసారులు ,వాహనదారుల దాహాన్ని తీరుస్తాయి అని,ప్రజలందరూ ఉపయోగించుకోవాలని .చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మంచికార్యక్రమం అని వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయం అని, అన్ని దానల కన్నా నీటి దానం చాల  గొప్పదని పేర్కొనడం జరిగినది .వేసవి కాలంలో .ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి చలి వేంద్రలు ఏర్పాటు చేయడం మంచి  కార్యక్రమం అని  ఈసందర్బంగా చలి  వేంద్రం ఏర్పాటు  చేసిన నిర్వాహకులు భవాని బైక్ పాయింట్ వారి ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ అభినదించడం జరిగినది .అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి చలి వేంద్రలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్ ముదిరాజ్, హన్మంత రావు , భిం రావు, రవి గౌడ్, శివ ముదిరాజ్, వెంకటేష్ , మహేష్ , మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page