ప్రత్తిపాటి శరత్‌ను‌ పోలీసు కస్టడీకి అప్పగించేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్ట్

Spread the love

పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం జరిగిన విచారణ
డొల్ల కంపెనీలను సృష్టించి నిధులు మళ్లించారనే ఆరోపణల శరత్‌ అరెస్ట్

డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా భారీగా నిధులు దారి మళ్లించారనే ఆరోపణలపై ఇటీవల టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ అరెస్టు వ్యవహారంలో ఏపీ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని పోలీసు కస్టడీకి అప్పగించేందుకు ఏపీ హైకోర్ట్ నిరాకరించింది. ఈ మేరకు పోలీసులు దాఖలు పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

కాగా అవెక్సా కంపెనీ బ్యాంకు అకౌంట్ నుంచి నిధులు దారి మళ్లాయని, ఎల్లో స్టోన్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రత్తిపాటి ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాలకు భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఈ సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్న శరత్‌ను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా లావాదేవీలు జరిగిన సంస్థలకు ప్రత్తిపాటి శరత్‌‌తో పాటు ప్రత్తిపాటి స్వాతి, ప్రత్తిపాటి వెంకాయమ్మ కూడా డైరెక్టర్లుగా ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page