అంగన్వాడి స్కూల్ అంటే పిల్లల కు వారికి పౌష్టిక ఆహారాలు అందించే కేంద్రంగా భావిస్తాం*

Spread the love

సాక్షిత ప్రకాశం జిల్లా మార్కాపురం* : అంగన్వాడి స్కూల్ అంటే పిల్లల కు వారికి పౌష్టిక ఆహారాలు అందించే కేంద్రంగా భావిస్తాం*
మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో గల ఒక అంగన్వాడి స్కూలు తయానితంగా ఉన్నది
గత ఐదు సంవత్సరముల నుంచి ఒక కమ్యూనిటీ హాల్ లో నడుపుతున్న ఈ అంగన్వాడి స్కూల్లో పిల్లలకి సరైన వసతులు కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు
ఈ విషయం అంగన్వాడి అధికారులకు తెలుసు అక్కడ ఉన్న కౌన్సిలర్లకు తెలుసు
తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
ఐదు సంవత్సరముల నుంచి కరెంటు కానీ పిల్లలకి వెళ్లడానికి బాత్రూమ్స్ కానీ లేవని తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు


పక్కనే ఉన్న స్కూల్ లో ఒక బంకు ఉన్నది అండి చెత్తాచెదారమంతా కూడా ఈ అంగన్వాడి స్కూల్ ప్రాంగణంలో నిత్యం వేస్తూ ఉండటం గమనించుకోవాలి
పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యమని అంగన్వాడి స్కూల్లో చెప్తూ ఉంటారు
తల్లిదండ్రులు చాలాసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని వాపోతున్నారు
వర్షం పడితే స్కూల్ కారుతుంది
ఇప్పటికైనా అంగన్వాడి సంబంధించిన అధికారులు కల్లు తెరుచుకొని అంగన్వాడి స్కూల్ కి కనీస వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page