మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి బత్తిని సోదరులు ఉచితంగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, దిల్లీ వంటి అనేక ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందుగానే వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి చేరుకున్నారు. చేప ప్రసాదం తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు.
కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…