కరీంనగర్ జిల్లాలో,, జమ్మికుంట లో గల ఇందిరానగర్ మైనార్టీ (బాలికల) పాఠశాల బాలికలను పట్టించుకోని ప్రిన్సిపాల్ ప్రణీత జాయ్,,,,,,
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఇంద్రానగర్ మైనార్టీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం ప్రణీత జాయ్ ఈరోజు తెల్లవారుజామున 8 తరగతి అమీనా అనే విద్యార్థి ని రంజాన్ నెల సందర్భంలో (సాహెర్) చెయ్యడానికి బాలిక ఉదయం 4 గంటల సమయంలో ఉపావాస దీక్ష కై భోజనం చేయడానికి కిందికి వచ్చి భోజనం చేసి చెరువు పైకి పోయి నమాజు చేయడానికి వెళ్లి జారిపడి ఎడమచేతు భుజం విరిగింది ప్రిన్సిపాల్ కు విద్యార్థి చెప్పినా కూడా రెండు గంటల వరకు మధ్యాహ్నం కూర్చోబెట్టి తల్లిదండ్రులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు హుటాహుటిన మైనార్టీ బాలికల హాస్టల్ కు విచ్చేసి తమ పాపను చూసేసరికి ఎడమచేతిభుజం వద్ద వాపు వచ్చింది గమనించి, తల్లిదండ్రులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, తిరే ఆధారంగా విద్యార్థి ఎడమ భుజం విరిగినట్టుగా డాక్టర్ నిర్ధారించారు.
ఈ సమస్యను తల్లిదండ్రులు యూత్ కాంగ్రెస్ నాయకులకు సమాచారం అందించగా వారు తక్షణమే పాఠశాల ఆవరణలోకి వెళ్లి సంబంధిత ప్రిన్సిపాల్ తో మాట్లాడదామనేసరికి ప్రిన్సిపాల్ లేకపోవడం ఇన్చార్జిగా ఎవరున్నారో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం విద్యార్థి తల్లిదండ్రుల కు ఎంత బాధ పడుతున్న కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల అధికారి అంబేద్కర్ గారికి ఫోన్ ద్వారా యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సజ్జాద్ , మహమ్మద్ దౌలత్ లు ఫోన్ ద్వారా సమాచారం అందించారు తక్షణమే వీరిపై చర్యలు తీసుకోకపోతే పాఠశాల ముందు ధర్నా రాస్తారో చేసి విద్యార్థికి తగు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.