శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలేం టోల్ ప్లాజా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికలను మడపాము,నాతవలస టోల్ గేట్లలో వుద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టోల్ ప్లాజా యెత్తి వేయడంతో 2007 నుంచి పనిచేస్తున్న106 మంది కార్మికులను మడపాము,నాతవలస టోల్ ప్లాజాల్లో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకపాలెం టోల్ ప్లాజాను అర్ధాంతరంగా డిసెంబర్ 7న ఎత్తివేసి ఇక్కడి ఆదాయం నాతవలస,మడపాం టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేసిన నేషనల్ హైవే అధికారులు15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను మడపాము,నాతవలసల్లో వుద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దేశం కోసం సరిహద్దులలో కాపలా కాసిన మాజీ సైనికులు పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వానికి ప్రశ్నించారు.నేషనల్ హైవే అధికారులు సమస్య పరిష్కారం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కి యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు,డి.వి.నర్సింహులు,యే.వి.ఆర్.మూర్తి,బి.శంకరనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నాతవలస టోల్ గేట్లలో వుద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…