కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులమతాలకతీతంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ, శాంతులతో ఉండాలని ప్రార్థించానని తెలిపారు. ప్రజల మధ్య సోదరభావాన్ని, సఖ్యతను పెంపొందించడంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే రీతిగా దర్గాలో పేదల కోసం చేపట్టే ఉచిత వైద్యసేవలు, ఉచిత భోజన వసతి, సేవలను కొనియాడారు.
