14.6 crores sanctioned by TFIDC for the development of Shad Nagar Municipality
షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీఎఫ్ఐడీసీ ద్వారా 14.6 కోట్ల నిధులు మంజూరు
జానమ్మ చెరువును పరిశీలించిన టీ ఎఫ్ ఐ డి సి ఎస్సి రమణమూర్తి
త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడి..
రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి
షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీ ఎఫ్ ఐ డీ సీ ద్వారా 14.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని టీ ఎఫ్ ఐ డి సి ఎస్సి రమణమూర్తి తెలిపారు. మున్సిపాలిటీలోని జానమచెరువును మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ తో కలిసి పరిశీలించారు.
వివిధ వార్డుల్లో 3.5 కోట్లతో సిసి రోడ్లు, 5.8కోట్లతో డ్రైనేజీలు, 2 కోట్లతో జానమ్మ చెరువు అభివృద్ధి , 2కోట్లతో సెంట్రల్ లైటింగ్, 1కోట్లతో పార్కుల అభివృద్ధి,30 లక్షలతో కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం అవుతుంది అని వివరించారు.
అదేవిధంగా ఫరూఖ్ నగర్ మండలం అల్లిసాబ్ గూడలో ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు కోసం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఈ సాజిత్, ఏఈలు మల్లికార్జున్, నరసింహులు స్థలాన్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతా ధికారులకు దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇటీవలే మున్సిపాలిటీలోని తిలక్ నగర్ కాలనీ మురుగు నీటి గుంతలు పడి బాలుడు మృతి చెందిన మురుగు కాలువను పరిశీలించారు. త్వరలోనే అంతర్గత మురుగు కాలువను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగేంధర్, చెట్ల నర్సింలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.