SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డు ను HRDCL అధికారులు మరియు జలమండలి అధికారులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ HRDCL అధికారులు మరియు జలమండలి అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పని చేయాలని,అవసరము ఉన్న చోట మంచి నీటి పైప్ లైన్ మరియు డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని,రోడ్డు నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా స్ప్రింగ్ వ్యాలీ అసోషియేషన్ వారి సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా జోనల్ ఆఫీస్ కు వెళ్లే HRDCL రోడ్డుకు కలిసే వీలుగా నూతనంగా నిర్మించబోయే లింక్ రోడ్డు ను పరిశీలించడం జరిగినది అని ఈ లింక్ రోడ్డును నిర్మాణం వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజల రవాణా సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ రోడ్డు ను నిర్మించేలా తగు చర్యలు తీసుకోవాలని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి రోడ్డు ను తీసుకురావలని , ఈ లింక్ రోడ్డు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు, కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేసారు. ఎన్నో ఏండ్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ రహిత సమాజానికి, ప్రత్యామ్నాయ రోడ్డు ను నిర్మించడానికి మరియు లింక్ రోడ్డును త్వరితగతిన వెంటనే ప్రారంభించి, పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగినది అదేవిధంగా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తామని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. శేరిలింగంపల్లి డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు పద్మారావు, రమణి,పవన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS