SAKSHITHA NEWS

US కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి మరకత శివాలయానికి ఆహ్వానం

సాక్షిత శంకర్పల్లి : అమెరికా కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆలయ చైర్మన్ దయాకర్, శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వదించి మరకత శివాలయ చిత్రపటాన్ని బహుకరించి ఆలయానికి ఆహ్వానించారు. సమయం చూసుకొని 11వ శతాబ్దానికి చెందిన మహిమగల మరకత శివాలయ దర్శనానికి వస్తానని డాక్టర్ తెలిపినట్టు దయాకర్ రాజు పేర్కొన్నారు.