రెబల్ స్టార్ కృష్ణంరాజు 84 వ జయంతి

Spread the love

ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు
జననం : 1940 జనవరి 20
జన్మస్థలం : మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం: 2022 సెప్టెంబరు 11
హైదరాబాదు
ఇతర పేర్లు : రెబెల్ స్టార్
వృత్తి జర్నలిస్టు, నటుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు 1970 – 2022
ఎత్తు 6’2″
భాగస్వామి: శ్యామలాదేవి
పిల్లలు : ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి

ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (1940 జనవరి 20 – 2022 సెప్టెంబరు 11) తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. ఇతడు జనవరి 20, 1940న జన్మించారు 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణంరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966 లో తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు ఈ సినిమా పెద్ద హిట్ అయింది కృష్ణంరాజుకు నంది అవార్డు కూడా లభించింది 1967లో ఎన్టి రామారావు తో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు 1968 వ సంవత్సరంలో కృష్ణంరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్ గా నటించారు ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు కృష్ణంరాజు మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు సీతాదేవి చనిపోయిన తరువాత 1996లో శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు టాలీవుడ్ హీరో ప్రభాస్ కి కృష్ణంరాజు పెదనాన్న అవుతారు అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 11 సెప్టెంబర్ 2022వ సంవత్సరంలో 82 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు

Whatsapp Image 2024 01 20 At 2.28.04 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page