స్పందనలో 258 అర్జీల స్వీకరణ

Spread the love

స్పందనలో 258 అర్జీల స్వీకరణ….

మండల స్పందన అర్జీలను ఆడిట్ చేయాలి….

                  జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వెల్లడి.. 

ఏలూరు, ఏప్రిల్ : 3 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను సంతృప్తికరంగా, నాణ్యతతో పరిష్కరించలాని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.మండల స్థాయి ఆడిట్ కమిటీ ప్రతి సోమవారం పరిష్కరించిన స్పందన అర్జీలను ఆడిట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయీ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్ల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ,జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఏ వి ఎన్ఎస్ మూర్తి , జడ్పీ సీఈఓ రవి కుమార్ , డిఆర్డిఏ పిడి విజయరాజు, పోలవరం ఎస్ డి సి సూర్యనారాయణ రెడ్డి, ఎస్. డి. సి. కె ఆర్ ఆర్ సి. జి వి.వి. సత్యనారాయణతో ఆర్డీవో కె. పెంచల కిషోర్ కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు.ఈ స్పందనలో 258 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు.

వీటిలో కొన్ని ….

వెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సాంబశివరావు గ్రామ పంచాయితీ స్ధలం ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని పక్కారోడ్డు వేయించాలని అర్జీ అందజేశారు. 

రాట్నాలగుంట గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ రైతులు పంట పొలాలుకు నీరు వెళ్లే తూములమీద అనాధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం వలన నీరు వెళ్లలేక పంటకు నష్టం కలుగుతుందిని దీనిని పరిశీలించి తగిన న్యాయం చేయాలని అర్జీ అందజేశారు. 

తంగెళ్లమూడి కి చెందిన సన్యాస అప్పలరాజు తమ పొలాలకు వెళ్లే పంటకాలువపైకి తాత్కాలిక కల్వర్టు అధికారుల అనుమతితో నిర్మాణం చేశామని,  వెంకట బాలకృష్ణ అనే వ్యక్తి కల్వర్టును కూల్చి దౌర్జన్యం చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు.  

ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామానికి చెందిన ఆంజనేయులు రొయ్యలమేత ఫ్యాక్టరీ నుండి వచ్చే దర్గంధం, వేస్టు నీరు మరియు ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే పొగ వల్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో వింత రోగాలు, ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఉందని ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోమని అర్జీ అందజేశారు. 

ఏలూరు లో జిల్లెలమూడి కి చెందిన ప్రసాదు బాలాజీనగర్ కాలనీలో మైకులు పెట్టి విపరీతమైన శబ్దకాలుష్యం కలిగిస్తున్నారని దీని వలన పదోతరగతి, డిగ్రీ పరీక్షలు వ్రాస్తున్న విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారని ఈ శబ్దకాలుష్యాన్ని అరికట్టాలని అర్జీ అందజేశారు.   

స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

……………………………………………………………………………………..
జిల్లా సమాచార పౌర సంబందాల శాఖ, ఏలూరు వారిచే విడుదల

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page