హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం

Spread the love

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో చేపట్టబోయే భవన నిర్మాణం పనులకు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి , కార్పొరేటర్లు హమీద్ పటేల్ , జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ సమగ్ర ,సంతులిత అభివృద్ధి లో భాగంగా మున్నూరు కాపు సంగం సభ్యుల విజ్ఞప్తి మేరకు హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే  సీడీపీ ఫండ్స్  ద్వారా మొత్తము 21,00 ,000/- ఇరవై ఒక లక్ష రూపాయల ఎమ్మెల్యే (CDP FUNDS ) నుండి 21 ,00,000/- లక్షల రూపాయలను మంజూరి చేయడం జరిగినది అని, భవనం ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అన్ని హంగులతో సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.చిన్న చిన్న సమావేశాలు, సభలు,ఫంక్షన్ లు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ ను నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు. కాలనీ ల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .కొండాపూర్ డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా  హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు  మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే భవనం నిర్మాణానికి సహాకరించిన ప్రభుత్వ విప్ గాంధీ కి మున్నూరు కాపు సంఘం సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు .

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు ,ప్రజలు, స్థానికులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page