సైబరాబాద్ లో మహిళా సంక్షేమ దినోత్సవం

Spread the love

1000 మంది విద్యార్థులకు అవగాహన


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఆదేశాల మేరకు (W&CSW) విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా (W&CSW) డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., మాట్లాడుతూ … గచ్చిబౌలి లోని అంజయ్య నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 200 మంది విద్యార్థులకు POCSO, Good Touch & Bad Touch, Abnormal behaviour of Strangers, How to be at Home & Outside, మరియు బాలమిత్ర కు సంబంధించిన అంశాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించమన్నారు. పాఠశాలలో క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశామని తెలిపారు.
KPHB J-Spiders కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన 500 మంది విద్యార్థులకు షీ టీమ్ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుంది? వారికి ఎలా ఉపయోగపడుతుంది, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ఫోన్ కాల్ మరియు సోషల్ మీడియా ద్వారా వేధింపులు, బాల కార్మికులు, బాలల వేధింపులు, బాల్య వివాహాలు, స్మైల్ టీమ్ గురించి కూడా వివరించడం జరిగిందన్నారు.

మహిళల అక్రమ రవాణా, గృహ హింస, Dial 100, భరోసా కౌన్సెలింగ్ కేంద్రం, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత, అపరిచితుల నుండి పిల్లలకు భద్రతా చర్యలు పై అవగాహన కల్పించామన్నారు.
అలాగే KPHB లోని రిషీ విమెన్స్ కాలేజీ కు చెందిన 300 మంది విద్యార్థినిలకు Cyber crimes, Phishing, Pornography, Anonymity of perpetrator, Cyber stalking, Cyber bullying, trolling, ID theft, Cyber Blackmail, Cyber Extortion వంటి వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు

ఈ కార్యక్రమంలో (W&CSW) విమెన్ అండ్ చైల్డ్ & సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., షి టీమ్స్ ఇన్ స్పెక్టర్ సునీత, మాదాపూర్ ఎస్ఐ భవాని, కేపిహెచ్ బి ఎస్ఐ జైరాజ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page