కార్మికులకు అండగా ఉంటా ఫ్లెమింగ్ లాబొరేటరీస్ లిమిటెడ్ జనరల్ బాడీ మీటింగ్

Spread the love

Will support the workers.. MLA who participated in the general body meeting of Fleming Laboratories Limited..

కార్మికులకు అండగా ఉంటా.. ఫ్లెమింగ్ లాబొరేటరీస్ లిమిటెడ్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే…

మెదక్ జిల్లా, శివ్వంపేట్ మండల పరిధిలోని నవాబ్ పేట్ గ్రామంలో జరిగిన ఫ్లెమింగ్ లాబొరేటరీస్ లిమిటెడ్ జనరల్ బాడీ మీటింగ్ లో ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, యూనియన్ ప్రెసిడెంట్ కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్మికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కార్మికులకు ఏ ఇబ్బంది ఉన్నా యాజమాన్యంతో రాజీలేని పోరాటం చేసి పరిష్కరించేలా కృషి చేస్తానని మాటిచ్చారు. అనంతరం యూనియన్ లో కొత్తగా చేరిన 20 మంది కార్మికులకు మెంబర్ షిప్ కార్డులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంతు చంద్ర గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page