36 వ వార్డులో నీటి కటకట

Spread the love

ప్రచురణార్థం డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక 36 వ వార్డులో నీటి కటకట – CPM కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధా రెడ్డి రేణుక వార్డు అయినా 36 వ వార్డు నందు గల డ్రైవర్స్ కాలనీ లో గత రెండు వారాలుగా త్రాగేందుకు మంచినీళ్లు లేక ట్రాక్టర్ వద్ద కుస్తీ పడుతూ ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుందని అదే దారిన రోజు వెళుతున్న డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధారెడ్డి రేణుక గారికి కనపడకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణమని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి. రాముడు విమర్శించారు నగర కార్యదర్శి టి.రాముడుమాట్లాడుతూ ఇంకా వేసవికాలం ప్రారంభం కాకముందే నగర కల్లూరు శివారు కాలనీలకు నీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు చాలా కాలం నుండి సిపిఎం పార్టీగా కల్లూరు కాలనీలలో అలాగే శివారు కాలనీలలో రోజు త్రాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని రెండవ సమ్మర్ స్టోరేజ్ బ్యాంకు నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వంలో మరియుఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఆందోళన పోరాటాలు చేస్తూనే ఉన్నాం అన్నారు ప్రభుత్వము ఎమ్మెల్యేలు అదిగో ఇదిగో అని మాయ మాటలు చెప్పడమే తప్ప కర్నూలు కార్పొరేషన్ లో కలిసి 25 సంవత్సరాల అవుతున్న కల్లూరు కాలనీ ప్రజలకు రోజు తాగేందుకు నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు తక్షణమేకమిషనర్ గారు స్పందిచి రెండు వారాలుగా త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న 36 వ వార్డు డ్రైవర్స్ కాలనీ ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కే .ప్రభాకర్. కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page