సెప్టెంబర్ 7న వినాయకసాగర్ ప్రారంభం – టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన

Spread the love

తిరుపతి నగరం

తిరుపతి కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా నిర్మించిన వినాయక సాగర్ ప్రాజెక్టును సెప్టెంబర్ 7వ తేది ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వినాయక సాగర్లో జరుగుతున్న పనులను సాయంత్రం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా లింగాలమ్మ చెరువుగా ప్రసిద్ధి చెంది, 59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువును వినాయక సాగర్ గా నామకరణం చేసుకుని ప్రజల సౌకర్యార్ధం, మంచి ఉద్యాన వనంగా ఏర్పర్చడం జరిగింది. 20 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరుగుతున్నది, ఇందులో వినాయక నిమజ్జనం కోసమని ప్రత్యేకంగా నిర్మించిన స్థలంలో పూర్తిగా శుద్ది చేసినటువంటి మంచినీళ్లతో నింపి వినాయక నిమజ్జనానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

గతంలో ఈ లింగాలమ్మ చెరువు అత్యంత దుర్ఘందంగా తిరుపతిలోని డ్రైనేజీ వాటర్ తో నిండి ఉండేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు అలా కాకుండా 5 ఎమ్.ఎల్.డి మురుగునీటి శుద్ధి ప్లాంట్ తో మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని, శుద్ధి చేసినటువంటి నీటిని మొత్తం చెరువులో నింపే కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ చాలా చక్కటి సదుపాయాలను ఆనందకరంగా ఉండే రీతిలో, ఒక మంచి కళారీతులను కూడా ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నదని, సెప్టెంబర్ 7న వినాయక సాగర్ ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వినాయక సాగర్లో అంచెలంచెలుగా చేపట్టబోవుతున్న ఏర్పాట్ల గురించి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోకం అనీల్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి, ఏయికామ్ ప్రతినిధి భాలాజీ, వైసిపి నాయకులు పాముల రమేష్ రెడ్డి, లైవ్లీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page