సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెరుకుమూడి సచివాలయ పరిధిలో 2వ రోజు కొమ్మలపూడి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .
కొమ్మలపూడి గ్రామంలో సుమారు 6 కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి కాకాణి.
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వినూత్నమైన, విశిష్టమైన కార్యక్రమం.
జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందుతున్నాయో, లేవో ప్రతి గడపకు వెళ్లి, ఆరా తీసి, అందని వారికి అందించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ప్రతి గడపకు వెళ్లి, ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్దిని వివరిస్తున్నాం.
ప్రభుత్వం, సంక్షేమ పథకాలను కొన్ని నియమ నిబంధనల ప్రకారం అమలు చేస్తుంది.
అర్హత కలిగి ఉండి, సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి, ప్రభుత్వానికి నివేదించి, వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ తీసుకునే వారు చనిపోతే తప్ప, అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్ వచ్చేది కాదు.
జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు సార్లు, కొత్త పెన్షన్లు ఇచ్చేలా ఆలోచన చేసి, అమలు చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాం.