జాడేలేని డబల్ బెడ్ రూమ్ ఇళ్లు తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం

Spread the love

Untraceable double bedroom houses are a colossal failure of the Tersa government

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా //

జాడేలేని డబల్ బెడ్ రూమ్ ఇళ్లు

తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం

హామీ నిలబెట్టుకోవాలాంటూ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆందోళన

భారీ ప్రదర్శన తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

మాభూమి అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని నిలబెట్టుకోవాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, కంగాల కల్లయ్య, వాసం బుచ్చిరాజు లు మాట్లాడుతూ ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని, మన తెలంగాణ స్వరాష్ట్రంలో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అంటూ ఊదరగొట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందారని, గత ప్రభుత్వాలు ఇల్లు సరిగా నిర్మించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదులు ఇళ్ల పేరుతో గ్రామపంచాయతీకి 20 ఇళ్లు అని చెప్పి లబ్ధిదారులను ఎంపిక చేసి అసలైన లబ్ధిదారులు ఎంపిక చేయకుండా తూతూ మంత్రంగా ముగించారని, మండల పరిధిలో ఇంకా కొన్ని డబల్ బెడ్ రూమ్ ఇల్లు బేస్మెంట్ స్థాయిలో, పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయని, కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ లబ్ది దారులకు ఇచ్చే పరిస్థితి లేదని, మండలంలో అనేక గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలు కోకొల్లలుగా ఉన్నారని, వీరందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. మండలంలో అనేకమంది చిన్నచిన్న ఇళ్లలోనే రెండు మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని, అలాగే ఇళ్ల స్థలాలు లేని వారు కూడా అనేకమంది ఉన్నారని వీరందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలకు హరిజన గిరిజన భూములను బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన రావడం లేదా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రతిపక్షంలో గెలిచి అభివృద్ధి పేరుతో పాలకపక్షంలో చేరినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇప్పించేందుకు కృషి చేయాలని వారు కోరారు. వినాయకపురంలో అవసరం లేని పార్కులకు ఫారెస్ట్ భూములను తీసుకునే ప్రభుత్వానికి, ఇల్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు.

ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, పోడు సాగుదారులందరికి పట్టా హక్కులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం స్థానిక డిప్యూటీ తహసిల్దార్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాడిస లక్ష్మణరావు, కుంజా అర్జున్, మడకం ముత్యాలరావు, కంగాల కన్నయ్య, కొమరం లక్ష్మి, కన్నాయిగూడెం, కావడిగుండ్ల, దిబ్బగూడెం సర్పంచులు గొంది లక్ష్మణరావు, కంగాల భూలక్ష్మి, కుంజా లక్ష్మి, కన్నాయిగూడెం ఉప సర్పంచ్ మడకం దుర్గారావు, సున్నం భీమయ్య, మెచ్చు సోమరాజు, పూనెం దుర్గమ్మ, మండల నలుమూలల నుండి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page