ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Spread the love

Union Minister Kishan Reddy congratulated the team of Prashant Verma and Teja Sajja Pan India Movie ‘Hanu-Man

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్‌’. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇటివలే విడుదలైన  ‘హను-మాన్’ టీజర్ సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ‘హను-మాన్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ 36 మిలియన్+ వ్యూస్ క్రాస్ క్రాస్ చేసి,  పాన్ ఇండియా ప్రశంసలు అందుకుంటూ, యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా హను మాన్ చిత్ర బృందాన్ని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. హను మాన్ టీజర్ అద్భుతంగా వుందని కితాబిచ్చారు.  

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్
ఎడిటర్: ఎస్బీ రాజు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Related Posts

You cannot copy content of this page