జిల్లాలో తుంబూరు దయాకర్ రెడ్డి పర్యటన

Spread the love

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం తీగల బంజర, ఏన్కూర్ మండలం జన్నారం క్రాస్ రోడ్ లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. అదేవిధంగా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో జరిగిన వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టా మహోూత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో దయాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం కారేపల్లి మండలంలో జరిగిన పలు వివాహాది శుభకార్యక్రమాలకు హాజరయ్యారు.

Related Posts

You cannot copy content of this page