పీవీ కి భారత రత్నతో తెలంగాణా సమాజం గర్విస్తుంది

Spread the love

కేసీఆర్ సర్కార్ లోనే పీవీ కి సముచిత స్థానం

పీవీకి భారత రత్న ఇవ్వడం పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు హర్షం

అద్భుతమైన పరిపాలనా ఆర్థిక సంస్కరణలతో తెలంగాణా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన తెలంగాణా ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం యావత్ తెలంగాణా సమాజం గర్విస్తుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జీవితాంతం రైతు సంక్షేమం కోసం కృషి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారత రత్న ఇవ్వడం పట్ల ఎంపీ నామ సంతోషం వ్యక్తం చేశారు. పీవీ కి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని నామ గుర్తు చేశారు.

పీవీ తెలంగాణా ముద్దు బిడ్డ అని, ఆయన్ని భారత రత్న తో గౌరవించాలని గతంలో కేసీఆర్ కోరారని నామ పేర్కొన్నారు. ఈ విషయమై లోక్ సభలో పలుమార్లు ప్రస్తావించడం జరిగిందని అన్నారు. పీవీ కి భారత రత్న ఇవ్వాలని మొదటిసారి డిమాండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని నామ అన్నారు. ఆయనకు కేసీఆర్ సర్కార్ సుముచిత స్థానం కల్పించి ఆయన వర్ధంతి, జయంతి ని కూడా నిర్వహించిందని, ఏడాది పాటు పీవీ శత జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని నామ తెలిపారు. కేసీఆర్ ప్రతిపాదన మేరకు కేంద్రం పీవీ స్మారక తపాలా బిళ్ళ విడుదల చేసిందన్నారు. పీవీ కుటుంబ సభ్యులకు ఎంపీ నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. పీవీ ప్రధానిగా అన్నింటా తనదైన ముద్ర వేశారని అన్నారు. పీవీ తెచ్చిన ఆర్ధిక సంస్కరణలు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి , దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించాయ ని కొనియాడారు. విదేశాంగ విధానాన్ని నూతన పధంలో నడిపించిన పీవీ దేశాన్ని అజయమైన శక్తిగా మార్చారని అన్నారు. దేశం వేగవంతమైన వృద్ధిని సాధించడం వెనుక పీవీ ఆర్థిక సంస్కరణలు కీలక పాత్ర వహించాయని నామ పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page