The development of villages is initiated by the government’s influence over the villages
ప్రభుత్వానికి పల్లెల పై ఉన్న మమకారంతోనే గ్రామాల అభివృద్ధికి శ్రీకారం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని చీమలదరి గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.
తెలంగాణ ప్రభుత్వానికి పల్లెలపై ఉన్న మమకారంతోనే, పల్లె ప్రజలు బాగుండాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ… దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు.
గ్రామంలో ఆశా వర్కర్ లేదని ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని ప్రజలు తెలుపగా, ఎమ్మెల్యే వైద్యశాఖ అధికారులతో మాట్లాడి చీమలదరి గ్రామంలో ఆశా వర్కర్ ను నియమించాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్య మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా AB స్విచ్ ఏర్పాటుకు కృషి చేయాలని, గ్రామానికి లో… ఓల్టేజ్ సమస్య ఉన్నందున నూతనంగా ట్రాన్స్ఫార్మర్ వెంటనే మంజూరు చేయాలని, పంట పొలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలని, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని బావుల పై పై కప్పులు ఏర్పాటు చేయాలన్నారు.
పశువులు త్రాగే నీటి తోట్టిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
మిషన్ భగీరథ త్రాగునీటిలో ట్యాంకు నిండి నప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలిపేలా… చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ… ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్ N. నరసింహారెడ్డి ని, పంచాయతీ కార్యదర్శి T. సుగుణ గారిని, ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.