The BCs are suffering hell in the forty houses given by the government during the Reddy's regime
రెడ్డి ల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన నలభై ఇండ్లలో నరకం అనుభవిస్తున్న బీసీ లు
సాక్షిత : ప్రభుత్వం ఇచ్చిన నక్ష బాటను కబ్జా చేసి బీసీలు చనిపోయిన డబ్బులు కడితేనే శవాన్ని తీసుకెళ్లడానికి బాటనిస్తానన్న రెడ్డిలు. గత్యంతరం లేక కన్నతల్లి శవాన్ని తీసుకెళ్లడానికి బీసీలు 40 కుటుంబాలు కలిసి రెడ్డిలకు లక్ష రూపాయలు చెల్లించిన వైనం.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ముకురాల గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం కొత్త జంగారెడ్డి సన్నాఫ్ బుచ్చిరెడ్డి దగ్గర రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసి 40 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 144 గజాల చొప్పున ప్రభుత్వం ఉచితంగా బీసీ సామాజిక వర్గం చెందిన కుటుంబాలకు ఇవ్వడం జరిగింది.
ఇట్టి స్థలంలో 30 ఇల్లు కట్టుకోవడం జరిగింది. ప్రభుత్వమిచ్చిన ప్లాట్లకు నక్షబాట. లేఅఔట్ బాట ను కొత్త రాంరెడ్డి సన్నాఫ్ పెద్ద జంగారెడ్డి కబ్జా చేయడం జరిగింది.నక్షబాట కబ్జా కు గురికావడంతో గత్యంతరం లేక వేరే దారి గుండా బాటచేసుకుని రాకపోకలు చేసుకునే వాళ్ళమని అదిచూసిన చిన్న జంగారెడ్డి భార్య అయినటువంటి శంకరమ్మ.
ముకురాల గ్రామ సర్పంచ్ మరియు అతని అనుచరులు పెద్ద మనుషుల సహకారంతో ఆ బాటను కూడా మూసి వేయడం జరిగింది. ఇండ్లకు దారి లేకుండా చేసి డబ్బులు ఇవ్వమని బెదిరింపులకు గురి చేయడం జరిగిందని ఎక్కడికైనా వెళ్లి కంప్లీట్ చేసిన మీ అంతు చూస్తామని మీకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలం కూడా జెసిబి లతో మీ ఇల్లు కూల్చి వేసి కబ్జా చేస్తామని బెదిరించడం జరిగిందని వారు అన్నారు.
గ్రామంలో ఒకరు చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి దారి కోసం లక్ష రూపాయలు తీసుకొని డబ్బులు ఇచ్చిన తర్వాతనే శవం తీసుకెళ్లడానికి దారి ఇచ్చారని. ఇలా లక్ష రూపాయలు ఎన్ని సార్లు ఇవ్వాలని బాధ్యత కుటుంబ సభ్యులు అన్నారు. గ్రామ సర్పంచ్ కి పలుసార్లు విషయం చెప్పిన పట్టించుకోకపోవడంతో కల్వకుర్తి ఎమ్మార్వో కల్వకుర్తి ఆర్డీవో కు ఫిర్యాదు చేయడం జరిగిందని న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని ముకురాల గ్రామస్తులు పత్రికా మిత్రులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముకరాల గ్రామస్తులు రమణ గౌడ్. సైదులు ఎం ముత్యాలు. కృష్ణ చారి. విష్ణుమూర్తి. పరమేశ్వర్. బి.శ్రీశైలం. బాలస్వామి. వెంకటయ్య. కృష్ణ. మల్లేశ్వరి. రజిత. రాములమ్మ. వెంకటమ్మ. అమృత. పద్మ. విజయలక్ష్మి. కళావతి. అంజమ్మ. తరగతులు తదితరులు పాల్గొన్నారు.