గొల్లపూడి లో ఘనంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు

Spread the love

గొల్లపూడి లో ఘనంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరావు

అన్న సమారాధనలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రోడ్డు మండలం గొల్లపూడిలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.

నాడు జరిగిన ఈ కార్యక్రమాలు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మహా చండీయాగం అక్కడ జరిపించిన అనేక పూజ కార్యక్రమాల్లో దేవినేని ఉమామహేశ్వర రావు స్థానిక పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడి అమ్మవారికి అతీతశక్తులు ఉన్నాయని.. గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా గంగానమ్మ వారు కాపాడుతుందని ప్రజల విశ్వాసమన్నారు.

అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు. కాగా తదుపరి అమ్మవారి శేష వస్త్ర వేలంపాట సాయంత్రం 6 గంటలకు గంగానమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమం జరగనుంది.

Related Posts

You cannot copy content of this page