Thanks to everyone who made the Mahasabha a success – Kurapati Venkateshwarlu
మహాసభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు – కూరపాటి వెంకటేశ్వర్లు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
గురువారం రోజున తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ ముందుగా నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తండోపతండాలుగా వచ్చి సభను విజయవంతం చేసిన తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు,
అనంతరం ఖమ్మం నగరంలో జరిగిన భహిరంగ సభను ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ నలుగురు మంత్రులు స్పందించడం ఆస్యాస్పదంగా ఉందన్నారు, ఉమ్మడి జిల్లాలోని ఏడు మండలాలను సీలేరు ప్రాజెక్టును లాక్కున్నారు అన్న మంత్రి అజయ్ అప్పుడు మీ మంత్రివర్గం ఏం చేస్తుందనీ ఎందుకు పోరాడలేదు అని అన్నారు, ఎన్టీఆర్ మహనీయుడని వారంటే గౌరవం ఉంది అంటూనే వారి పెట్టిన పార్టీని హేళన చేయడం మీకు తగదని అన్నారు,
చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో సభ పెట్టావు అన్న మంత్రి కి ఖమ్మం అభివృద్ధి చెందింది టీడీపీ హయాంలోనే తెలంగాణలో అది ఖమ్మం గడ్డలో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశంపార్టీకే ఉందని అన్నారు, హైదరాబాద్ కు ఐ.టీ తెచ్చానని ఖమ్మం అభివృద్ధి తానే చేశానని చెప్పుకుంటున్నారన్నారు ఒక్కసారి గూగుల్లో చూసి తెలుసుకోమన్నారు.
ఖమ్మం సభలో బాబు ప్రసంగంలో టిఆర్ఎస్ పార్టీని గానీ నాయకులను గానీ ఎక్కడ విమర్శించలేదని అది బాబు గొప్పతనం అని మీరు చూసి నేర్చుకోవాలని, ఆ జన సందోహాన్ని చూసి మీ పార్టీకీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది కనుకనే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు చంద్రహస్, ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, రాష్ట్ర కార్యదర్శి సానబోయిన శ్రీనివాస్ గౌడ్, టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి భాస్కరరావు, నగర అధ్యక్షులు వడ్డేo విజయ్, ఐటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకారపు శ్రీనివాస్, అధ్యక్షుడు సన్నే అనిల్, తెలుగు యువత అధ్యక్షులు నల్లమల రంజిత్, నగర ప్రధాన కార్యదర్శి ప్యారిస్ వెంకన్న, చింత నిప్పు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.