హలో యువత 29న ఛలో ఖమ్మం

Spread the love

Hello Youth Chalo Khammam on 29th

హలో యువత 29న ఛలో ఖమ్మం,కేరళ సీఎం రాక.

29న ఖమ్మంలో వేలాది మందితో జరిగే భారీ ప్రదర్శన,బహిరంగ సభ,రెడ్ షర్ట్ కవాతు ని జయప్రదం చేయండి.

డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపు.

ఏన్కుర్ లో యువతకి రెడ్ షర్ట్ కవాతు ట్రైనింగ్ ప్రిపరేషన్ కార్యక్రమం.

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ :

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 29న ఖమ్మం యస్.ఆర్ &బి.జి.ఎన్. ఆర్ డిగ్రీ కాలేజి గ్రౌండ్స్ లో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభ, రెడ్ షార్ట్ కవాతు వేలాది మందితో జరుగుతుందని,హలో యువత ఛలో ఖమ్మం కి యువత,ప్రజలు బయల్దేరి రావాలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ పిలుపునిచ్చారు.


స్థానిక కార్మిక,కర్షక భవన్ నందు యువతకి రెడ్ షర్ట్ కవాతు ట్రైనింగ్ ప్రిపరేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా కేరళ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరాయ్ విజయన్ గారు, మాజీ పార్లమెంట్,శాసన సభ్యులు తమ్మినేని. వీరభద్రం ,జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వేలాది మంది యువతితో రెడ్ షర్ట్ కవాతు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. కేరళ కమ్యూనిస్టుల పరిపాలన దేశానికే రోల్ మోడల్ గా ఆదర్శoగా నిలిచిందని, అక్కడ యువతకు ఉద్యోగాల కల్పనలో కాని స్థానిక పరిశ్రమల ఏర్పాటుతో ఎన్నో అవకాశాలను కల్పించిందని ఆయన అన్నారు.

దేశంలోనే కార్పొరేట్ స్థాయిలో విద్య,వైద్యం ప్రతి పేదవాడికి అందిస్తుంన్న ఏకైక రాష్ట్రం కేరళ అన్ని అలాంటి మోడల్ ని దేశ వ్యాప్తంగా తెలంగాణలో కూడా అమలు చేయాలని, అన్నిటికీ రోల్ మోడల్ గా ఉన్న కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.అలాంటి రాష్ట్రనికి ముఖ్యమంత్రిగా ఉన్న సిఎం ఖమ్మం వస్తున్నాడని, ఈ బహిరంగ సభలో, ప్రదర్శనలో, రెడ్ షర్ట్ కవాతు కార్యక్రమంలో నేటి యువత, ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చాడు.

ఈ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు షేక్.పాషా, నాయకులు సాయి, అద్మారావు, అన్వేష్, సాయి తేజ, వంశీ, పవన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page