ఘనంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Spread the love

ఘనంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

సాక్షిత నంద్యాల జిల్లా డోన్

రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు, డోన్ నియోజకవర్గ టిడిపి అ భ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహమునకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు తెలుగుదేశంపార్టీ జెండాను డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు మాట్లాడుతూ.సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు చేతులు మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశంపార్టీది ఘనమైన చరిత్ర అని అన్నారు. నేటికీ 41వసంతాలు పూర్తిచేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెట్టిందని. 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదంతో పార్టీ ఆవిర్భావించిందని అన్నారు. పేదల జీవితాలకు పెన్నిధిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా, బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలు ఎన్నో తెచ్చింది తెలుగుదేశంపార్టీ అని అన్నారు.

అగ్రకులాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని బిసి, ఎస్సి, ఎస్టి ,ముస్లిం మైనార్టీలకు చేరువయ్యేలా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు కిలో రెండు రూపాయలకే బియ్యం అందించిది, పేదలకు పక్కా గృహాలు కట్టించింది, రైతులకు 50 కే హార్స్ పవర్ విద్యుత్ అందించింది తెలుగుదేశంపార్టీ అని అన్నారు. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు విద్య ,ఉపాధి ,రాజకీయ సామాజిక రంగాలలో అవకాశం కల్పించింది తెలుగుదేశంపార్టీ అని ఈ 41 వసంతాలలో తెలుగుదేశంపార్టీ ఎన్నో గెలుపు ఓటములు ఎన్నో చూసిందని , ఓడిన ప్రతి సారి ఎగిసిపడే కేరటం ల నిలబడింది మన తెలుగుదేశంపార్టీ అని అన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ జెండాను ఎగురవేసి మన అన్న ధర్మవరం సుబ్బారెడ్డి ని ఎమ్మెల్యే గా చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి అధికార ప్రతినిధి విజయ్ భట్ , మాజీ ఎంపీపీ దేవరబండ వెంకటనారాయణ గౌడ్. నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ కమిటీ నాయకులు మల్లెంపల్లె జయ్యన్న ,క్లస్టర్ ఇంచార్జ్ మిద్దెపల్లె గోవిందు , డోన్ నియోజకవర్గ టిడిపి రైతు కమిటీ అధ్యక్షులు మల్లయ్య , డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు , బాలక్రిష్ణ అభిమాన సంఘం నాయకులు హుస్సేన్ పీరా మండల పట్టణ టిడిపి నాయకులు,తెలుగు యువత టిడిపి నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page