తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం

Spread the love

Telangana State Government Bathukamma Day

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు సారెగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ ఫేస్ 1 లోని లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేయడం జరిగింది

. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ప్రతి పేదింటి ఆడపడుచు పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి డివిజన్ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, అంజిరెడ్డి, రామకృష్ణ బాబాయ్, చంద్రశేఖర్ రెడ్డి, రాజు, సత్యనారాయణ, అశోక్ దత్త, సి.ఓ ముస్తఫా, సమాఖ్య ఆర్.పిలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page