తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల

Spread the love

తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం అమానుషమని వైయస్ షర్మిల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొంటున్న వైయస్ షర్మిల నారాయణపేట జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర లో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

తెలంగాణా ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించింది

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి పాదయాత్రగా వచ్చిన వైయస్ షర్మిల సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేసిన షర్మిల ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం చేయకపోతే ఎట్లా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు వైయస్ షర్మిల.

అధికారం ఇస్తే ఉద్యమకారులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం

వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి అధికారం ఇస్తే ఉద్యమకారులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉద్యమకారులకు ఇళ్లు, ఉద్యోగాలతో పాటుగా జీవితాంతం పెన్షన్ అందిస్తామని వైయస్ షర్మిల పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో మహిళలకు సమాన విలువ లేదని, ఇంకా మహిళలపై చిన్నచూపు చూస్తున్నారు అని వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశంలో మహిళలకు సమానత్వం లేదని పేర్కొన్నారు వైయస్ షర్మిల. మరియమ్మ అనే మహిళ ను జైల్లో పెట్టి చంపేశారని ఆరోపించారు.

ఆశీర్వదించండి.. సుపరిపాలన అందిస్తాం

మద్యనిషేధం అమలు చేయకుండా మద్యం అమ్మకాల మీద రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటూ వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్నికలలో తనను ఆశీర్వదిస్తే సుపరిపాలన అందిస్తానని వైయస్ షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవమని, వైయస్సార్ ఆఖరి నిమిషం వరకు ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయారని వైయస్ షర్మిల గుర్తు చేశారు. తమకు ఒక అవకాశం ఇస్తే వైఎస్ తరహాలో సుపరిపాలన చేసి చూపిస్తామన్నారు వైయస్ షర్మిల.

దొరల పాలన విముక్తికి ఎంతదాకైనా వెళ్తాం అన్న షర్మిల

ఇక ఇదే సమయంలో సమస్యలతో అల్లాడుతున్న ప్రజలకు అండగా నిలబడి, ధైర్యం కల్పించి, వారి సంక్షేమం కోసం చేపట్టిందే ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల . వైఎస్సార్ బిడ్డగా అడుగడుగునా ఆదరించి, అక్కున చేర్చుకుంటున్న ప్రజల రుణం తీర్చుకోలేనిదని షర్మిల వెల్లడించారు. వైఎస్ షర్మిల కుటుంబ పాలన అంతానికి, దొరల పాలన విముక్తికి, సంక్షేమ తెలంగాణ సాధనకు వైఎస్సార్ తెలంగాణా పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎండైనా,వానైనా ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్తాం వైఎస్సార్ సంక్షేమ పాలనకు శ్రీకారం చుడతాం అంటూ తమ ఆశయాన్ని స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page