వివేకానంద సేవ సంఘం వృద్ధాశ్రమం లో టెక్ మహీంద్రా సాఫ్ట్ వెర్ సంస్థ

Spread the love

Tech Mahindra Software Institute in Vivekananda Seva Sangam Old Age Home

మియాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద సేవ సంఘం వృద్ధాశ్రమం లో టెక్ మహీంద్రా సాఫ్ట్ వెర్ సంస్థ యొక్క SBU - ET HR  గ్రూప్ విభాగం కు చెందిన HR ప్రశాంత్ జన్మదినం ను పురస్కరించుకుని 5,000 రూపాయల ఆర్థిక సహాయం తో పాటు నిర్వహించిన అన్నదానం కార్యక్రమం ను 

 కార్పొరేటర్  ఉప్పలపాటి శ్రీకాంత్  తో కలిసి వృద్ధులకు అన్న ప్రసాదాలు వడ్డించి నిర్వాహకులకు చెక్కు ను అందచేసిన  ప్రభుత్వ విప్  ఆరెక పూడి గాంధీ


ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ  మాట్లాడుతూ ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ తనకు తోచిన విధంగా సహాయం చేయడం ,వృద్ధులకు, అన్నదానం చేయడం అభినందనియం అని,

 వృద్దుల మధ్య జన్మదినం నిర్వహించుకోవడం చాలా అభినందించదగ్గ విషయం అని,ఎంతో మందికి ఆదర్శ ప్రాయులుగా నిలిచారు అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు .

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, తెరాస నాయకులు MD ఇబ్రహీం, మరియు టెక్ మహీంద్రా సంస్థ ప్రతినిధులు ప్రశాంత్, శ్రీధర్ ,కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page