సైబర్, సోషల్ మీడియా నేరాల కట్టడికి పటిష్టమైన చర్యలు…
పోలీస్ కమిషనర్

Spread the love

సైబర్, సోషల్ మీడియా నేరాల కట్టడికి పటిష్టమైన చర్యలు…
పోలీస్ కమిషనర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సైబర్ నేరాలు, సోషల్ మీడియా నేరాల కట్టడికి జిల్లాలో సైబర్ ల్యాబ్స్ ను
పటిష్టం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
సోమవారం నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ అధికారులతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ .. సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్లు అమాయకులను బురిడీ
కొట్టిస్తూ అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, ఓటిపి మోసాలు, ఆధార్ అనుసంధానం, బీమా సంస్థల పేరుతో మోసాలు, ప్రభుత్వ పథకాల పేర్లతో మోసాలు, బిట్ కాయిన్ మోసాలు, మహిళల పట్ల అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు, మర్ఫెడ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటి అనేక నేరాల
పాల్పడుతున్నారని అన్నారు.


ఈ మోసాలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ సెల్ ల్యాబ్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేసి
సైబర్ నేరాలుపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు.
వీటికి ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్, లాప్ టాప్, హై ఎండ్ కంప్యూటర్ వంటి ఆధునిక హార్డ్ వేర్ ను ద్వారా పటిష్టం చేసి నేరాలను కట్టడికి మరింత కృషి చేయాలని అన్నారు. విడతలవారీగా సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, సోషల్ మీడియా నేరాల నియంత్రణపై సైబర్ నిపుణులతో మరింత శిక్షణ ఇస్తామని తెలిపారు.
జిల్లా స్థాయి సిబ్బందికి నిపుణులు చేత సూచనలు సలహాలను అందిస్తూ కేసు దర్యాప్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపుతామన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page