మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభం.

Spread the love

సాక్షిత : ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.
బెంగళూరు హై వే నుండి ఐటీ టవర్ కు 100 Ft నూతన కనెక్టింగ్ రోడ్డు కు అనుసంధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పెద్ద ముఖ ద్వారము ను నిర్మించాలని TSIIC అధికారులను ఆదేశించారు .
ఐటి టవర్ నుండి మహబూబ్ నగర్ పట్టణానికి కనెక్టింగ్ రోడ్ల ను నిర్మించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవం పై TSIIC అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మహబూబ్ నగర్ లోని దివిటీ పల్లీ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే నెల 6 వ తేదీన రాష్ట్ర IT, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారిచే ఘనంగా ప్రారంభించటానికి ఏర్పాట్లు చేయాలనీ మంత్రి అదేశించారు. జాతీయ రహదారికి ఐటీ టవర్ కి వెళ్లే దారిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పెద్ద ముఖ ద్వారము కనెక్టింగ్ రోడ్డు అనుసంధానంగా నిర్మించాలని ఈ సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. అలాగే IT టవర్ నుండి మహబూబ్ నగర్ పట్టణానికి అధునాతన రోడ్లను నిర్మించాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను ఘనంగా చేయాలనీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను అదేశించారు.

ఈ కార్యక్రమంలో టిఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ డి. రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రముఖ కన్సల్టెంట్ రాజ్ కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారులు నరసింహ, రాజశేఖర్ రెడ్డి ,అమర రాజా సంస్థ ప్రతినిధులు మసూద్ రవితేజ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page