శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

Spread the love

శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌన్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్.

ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల, సర్పంచ్ల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను తీసుకురావాలని, ప్రస్తుతం వారు స్వతంత్ర శాఖ ఉద్యోగులుగా గ్రామ పంచాయతీలకు, సర్పంచు లకు సంబంధం లేకుండా సమాంతర వ్యవస్థగా, పోటీ వ్యవస్థగా పనిచేస్తున్నారని, ఇది సర్పంచుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మరియు గౌరవ – మర్యాదలను కాలరాచినట్లే అని, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన సర్పంచులు కంటే తాత్కాలిక ఉద్యోగులయిన వాలంటీర్ల కే ఎక్కువ అధికారాలు ఉండటం సిగ్గుచేటైన విషయం అని సర్పంచుల అధికారాలను సచివాలయాల కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అదేవిధంగా 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243 జి, 11 వ షెడ్యూల్లో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 29 అంశాలకు చెందిన ప్రభుత్వ శాఖల పైన ఇచ్చిన అధికారాల ప్రకారం గ్రామ సచివాలయాలు, సచివాలయ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్ లను సర్పంచుల ఆధ్వర్యంలోనే పని చేయించాలని, ఆ 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందిని, నిధులను మరియు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసే పర్యవేక్షణా ధికారాలను మరియు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారాలను మా గ్రామ పంచాయతీలకు, గ్రామ సభలకు, సర్పంచ్లకు ఇస్తూ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గానే వారిని మార్పు చేసి వారికి జీతాలు, సెలవులు ఇచ్చే అధికారం కూడా సర్పంచులకు ఇస్తూ, ఈ సమాంతర వ్యవస్థను, పోటీ వ్యవస్థను, సచివాలయ శాఖను మా గ్రామ పంచాయతీలలో విలీనం చేస్తూ తగిన స్పష్టమైన ఆదేశాలను, జీవోలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ,ప్రధాన కార్యదర్శి పిరు కట్ల విట్టల్ , జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పి.ఎం.జె. బాబు , రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మరియు పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, ముల్లంగి రామకృష్ణారెడ్డి,సింగంశెట్టి సుబ్బరామయ్య, అన్నెపు రామకృష్ణ నాయుడు, బొర్రా నాగరాజు, మునిరెడ్డి,చుక్క ధనుంజయ్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related Posts

You cannot copy content of this page