Sri Sai Nagar Colony Theme Park to be launched by Minister Tanniru Harish Rao
సాక్షిత : వచ్చే నెలలో ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభం కానున్న శ్రీ సాయి నగర్ కాలనీ థీమ్ పార్క్,డివిషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమీషనర్ బాలయ్య
మరియు ఎలక్ట్రిసిటీ ఏఈ ప్రశాంత్,ఎలక్ట్రికల్ ఈఈ ఇంద్రదీప్,ఏఈ రామ్మోహన్,శానిటేషన్ సూపెర్వైసోర్ వెంకటేశ్వర్లు,లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్,ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమన్ మరియు ఇతర విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి థీమ్ పార్క్ లో పర్యటించిన పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి .
అలాగే థీమ్ పార్క్ లో ఉన్న వాల్ పెయింటింగ్,ఓపెన్ జిమ్ ఐటమ్స్,మొక్కలను,సిట్టింగ్ సోఫాస్,వెయిటింగ్ హాల్ ను సందర్శించి త్వరగా చివరగా ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ముస్తాబు చెయ్యండి అని అధికారులకు కార్పొరేటర్,ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది.
అలాగే రామచంద్రారెడ్డి నగర్,మల్లికార్జున నగర్,ఓల్డ్ రామచంద్రపురం,సాయి నగర్ కాలనీ,సండే మార్కెట్ శ్రీనివాస్ నగర్ కాలనీ,వార్డ్ కార్యాలయ ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి అని,కావున తగిన ఏర్పాట్లను చేసుకోవాలి అని అధికారులకు తెలిపిన ఎమ్మెల్యే,కార్పొరేటర్.వారితో మహేందర్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,శంకర్,ప్రకాష్,వీరిశెట్టి,సురేష్,నాగరాజు,సంగప్ప,భాస్కర్,సురేందర్ రెడ్డి,చంద్రశేఖర్,నాగేశ్వర్ రావు,జార్జ్,మహిళలు,కాలనీ వాసులు.