శ్రీరామ రామ రామేతిరమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యంరామనామ వరాననే”

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ లోని వాడవాడలా రాములోరి కళ్యాణం…శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడా ట్రేడ్ సెంటర్, తారానగర్, ఆదర్శ్ నగర్, బాపునగర్, సురభి కాలనీ, ఆర్ జి కే, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల హుడా, శ్రీరామ్ నగర్ కాలనీ, ఏ పి హెచ్ బీ కాలనీ మరియు వివిధ కాలన లలో “శ్రీరామనవమి” పురస్కరించుకొని ఏర్పాటు చేసిన “శ్రీ శ్రీ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో” కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదములను స్వీకరించారు. శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులకు పాత్రులయ్యారు

పచ్చటి పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు..వేదపండితుల మంత్రోచ్ఛారణలు..మేళతాళ ల సందడి..అశేష భక్తుల జయజయ ధ్వానాల నడుమ శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. శేరిలింగంపల్లి నలుమూలల రాములోరి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. జగధబిరాముడి పెండ్లి వేడుకను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. జై శ్రీరాం.. జై జై శ్రీరాo నినాదాలు చేస్తూ భక్తిభావం చాటుకున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ మరియు డివిజన్ ప్రజలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని కార్పొరేటర్ తెలిపారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, రామ్ మెహన్ రెడ్డి, గోపాల్ యాదవ్, కొండల్ రెడ్డి, రాగం అభిషేక్ యాదవ్, పవన్, మహేష్, జనార్ధన్ రెడ్డి, యాదగిరి గౌడ్, జనార్దన్ గౌడ్, విజయందర్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, రాజు ముదిరాజ్, మహేష్ చారీ, రవి, కుమార్, కోదండరాం, వెంకట్ రెడ్డి, శేఖర్, రంజిత్, రవి కిరణ్, సురేందర్, మహేందర్ సింగ్, సత్యనారాయణ, రమేష్, ఆయా ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page